అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించారు. ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్మాత వంశీ నందిపాటి మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి మాట్లాడుతూ,’ఈ మూవీని నేను ఆల్రెడీ చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్. మిడిల్ క్లాస్ జీవితాల్ని చూపించారు. సినిమాని చూస్తూ నేనెంతో ఎంజాయ్ చేశాను. ఎంతో వైబ్ కనిపించింది. ప్రాపర్ హైదరాబాద్‌ను చూపించిన చిత్రాల జాబితాల్లో ఈ సినిమా ఉంటుంది. బిల్డింగ్ స్ట్రక్ఛర్ గురించి రమణా రెడ్డిని కలిశాను. ఈ సినిమాతో రమణా రెడ్డి నన్నైతే నిరుత్సాహపర్చలేదు. ఎంతో ఎత్తైన బిల్డింగ్‌లను నిర్మించే రమణా రెడ్డి .. ‘అమీర్ లోగ్’ని అంతే ఎత్తులో నిలబెట్టారు. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. స్మరణ్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని పది పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంతో ఎంతో మంది కొత్త వాళ్లు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది. ఇలాంటి చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ,’నేను రాసిన కథను నటనతో ఇంకో లెవెల్‌కి తీసుకు వెళ్లిన ఆర్టిస్టులకు థాంక్స్. మా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నాను’ అని చెప్పారు.
అందర్నీ మెప్పించే ‘అమీర్ లోగ్`
- Advertisement -
- Advertisement -



