‘ఓ..తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. వినోదం, ప్రేమ, నవ్వులతో నిండిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అలరించబోతోంది. ఈనెల 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మల యాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఇప్పటివరకు భార్యాభర్తల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి, అలరించాయి. వాటి మాదిరిగానే మా సినిమా మిమ్మల్ని మెప్పిస్తుంది. ముట్టుకుంటే షాక్ కొట్టే భార్యతో ఓ భర్త ఎలా సంసార ప్రయాణాన్ని సాగించాడు?, అసలు ఆ షాక్ కథేంటి అనేది తెలియాలంటే సినిమాని చూడాల్సిందే. ఓ మంచి వినోదాత్మక సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం అని నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమాకి నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి, దర్శకత్వం: భరత్ దర్శన్, డీవోపీ: సీహెచ్. కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు, ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి, ఎడిటర్: శ్రీ వరప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి, లిరిక్స్: పూర్ణాచారి, ఫైట్స్ : అంజి, కొరియోగ్రఫీ: జెడి మాస్టర్.
సుకుమారిసెన్సార్ పూర్తి
- Advertisement -
- Advertisement -



