అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.
ఈ మూవీ ఈనెల 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఇక ట్రైలర్‌కి నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
తాజాగా చిత్రయూనిట్ మరో సర్ ప్రైజ్‌తో అభిమానుల్లో అంచనాల్ని మరింతగా పెంచింది.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ‘లెనిన్’ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా కథను, నేపథ్యాన్ని, శ్రీరామ పురం గురించి ఎన్టీఆర్ తన గంభీరమైన గాత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
ఇక థియేటర్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌కి, ఆయన ఇచ్చే ఎలివేషన్స్‌కి బాక్సులు బద్దలయ్యేలా ఉంది. ఎన్టీఆర్ ఇచ్చే ఈ వాయిస్ ఓవర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఎన్టీఆర్‌కి నాగార్జునతో, అక్కినేని కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. అందుకే అఖిల్ కోసం ఎన్టీఆర్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి ‘లెనిన్’కి తన వంతుగా సపోర్ట్ చేశారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం, లియోన్ బ్రిట్టో కెమెరావర్క్, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణలు అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘లెనిన్` కోసం ఎన్టీఆర్..
- Advertisement -
- Advertisement -



