టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సంకల్పం తీసుకుంటామని తెలిపారు. బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం.. ఆ తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పాటు పడుదామన్న జయశంకర్ సూచనల మేరకు తాము 50 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పాటు పడుతున్నామని తెలిపారు. తాము నిర్వహించబోయే సభ దేశ గతినే మార్చేస్తుందని అన్నారు. తమిళనాడులోని స్కూళ్లలో ఎమ్జీఆర్ ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా తమ హైదరాబాద్ సభ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రశ్న రావణ్‌పై ఉపాను ఖండిస్తున్నాం
బీసీ రిజర్వేషన్లపై ఆగస్టు 6న భారీ బహిరంగ సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



