Tuesday, July 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంట్రాన్స్‌ప్లాంట్‌ హబ్‌గా సనత్‌నగర్ టిమ్స్‌

ట్రాన్స్‌ప్లాంట్‌ హబ్‌గా సనత్‌నగర్ టిమ్స్‌

- Advertisement -

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి 
దామోదర్‌ రాజనర్సింహ
ఆస్పత్రిని సందర్శించిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు..మంత్రితో కలిసి మాడ్యులర్ థియేటర్ల పరిశీలన‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు నిలయంగా సనత్‌నగర్‌‌ టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం సనత్‌‌నగర్‌ ‌టిమ్స్‌‌ను ఆయన నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లతో కలిసి సందర్శించారు. అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ-ఆపరేటివ్, పోస్ట్-ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలు, ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించారు. అనంతరం టిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్ప త్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ డాక్టర్లకు అత్యంత నైపుణ్య ముందనీ, ఇప్పటికే అత్యంత క్లిష్టమైన ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు కూడా ప్రభుత్వాస్పత్రుల్లో నిర్వహిస్తున్నారని కొని యాడారు. అన్ని రకాల అవయవ మార్పిడి సేవలను ఒకే వేదికపై అందించేలా సనత్‌నగ ర్ టిమ్స్‌ను ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్సలెన్స్ సెంటర్‌‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉన్నందున, దశలవారీగా వివిధ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రారంభించాలనీ, సేవల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని హామీనిచ్చారు. నిమ్స్‌లో న్యూరో, కార్డియోథొరాసిక్, యూరాలజీ సర్జరీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ పరిమిత సంఖ్యలోని ఆపరేషన్ థియేటర్ల కారణంగా వాటిని విడతలవారీగా వినియోగించాల్సి వస్తోందని నిమ్స్ నుంచి వచ్చిన సర్జన్లు తెలిపారు. రోగుల సంఖ్య అధికంగా ఉండటంతో, సర్జరీల కోసం పేషెంట్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ నిమ్స్‌లో న్యూరో సర్జరీలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు తదితర సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న రోగులకు టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నిమ్స్‌ వైద్య బృందాలు టిమ్స్‌లో‌ని ఆపరేషన్ థియేటర్లను వినియోగించుకునేలా అవసరమైన పరిపాలనా ఏర్పాట్లు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్‌ను ఆదేశించారు. నిమ్స్ మాదిరిగానే సనత్‌నగర్ టిమ్స్‌ను కూడా స్వయంప్రతిపత్తి సంస్థగా నిర్వహిస్తామనీ, డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకాలు కూడా అదే విధానంలో చేపడతామని స్పష్టం చేశారు. టిమ్స్ సేవలు అందుబాటులోకి వస్తే నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వాస్ప త్రులపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందన్నా రు. సమావేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహయ్, జీవన్‌దాన్ ఇన్‌చార్జి డాక్టర్ భూషణ్ రాజ్‌, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు మధుసూదన్, మనీషా సహాయ్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -