Tuesday, July 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి

పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి

- Advertisement -

మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ-మర్కుక్‌

పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల పరిధిలోని కర్కపట్ల గ్రామంలో బయోటెక్‌ పార్క్‌-3లో ఏర్పాటు చేసిన శిరో ఫార్మా అత్యాధునిక ఔషధ ఉత్పత్తి కర్మాగారాన్ని ఆ సంస్థ చైర్మెన్‌ గోవిందారెడ్డి, మదుసూదన్‌లతో కలసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఫార్మా రంగానికి అధిక ప్రాధాన్యత, అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టు బడులు, ఉఫాది కల్పన కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఫార్మా రంగంలో తెలంగాణను ప్రపంచ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ ఫార్మా రంగంలో హైదరాబాద్‌ అగ్రగామిగా నిలిచిందని, ఆ ఫార్మా బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణను ఫార్మా రంగానికి ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌కు సంబంధించిన ఔషధాలను తయారు చేసే పరిశ్రమలకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో శిరో ఫార్మా సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన భూమి, రెవెన్యూ లేదా ఇతర పరిపాలనా సమస్యలు ఏవైనా తలెత్తితే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రులు హామీ ఇచ్చారు. 1991-92లో సాఫ్ట్‌వేర్‌ రంగానికి వేసిన పునాది వల్ల నేడు తెలంగాణ ఐటీ రంగంలో ప్రపంచ గుర్తింపు పొందిందన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఫార్మా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారుతుందన్నారు. శిరో ఫార్మా సంస్థ దేశంలోని అత్యాధునిక యంత్రాంగంతో ఏర్పాటు చేసిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. జహీరాబాద్‌ను నేషనల్‌ ఇండస్ట్రీయల్‌ జోన్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్‌. చంద్రకళ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష‍ురాలు తూంకుంట అంక్షారెడ్డి, తహసీల్దారు సరిత, సర్పంచ్‌ గొండ్లే కవిత నర్సింలు, ఉపసర్పంచ్‌ అన్వర్‌ పాషా, మార్కెట్‌ కమిటీ చైర్మెన్లు నరేందర్‌ రెడ్డి, విజయ మోహన్‌, అత్మ కమిటీ చైర్మెన్‌ తాండ కనకయ్య, కాంగ్రెస్‌ మండలాధ్యక్ష‍ులు గుర్రాల నర్సింలు, పరిశ్రమ సిబ్బంది, తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -