Tuesday, July 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌కన్నేపల్లి పంప్‌‌హౌస్‌ మోటార్ల ప్రారంభంపై ప్రభుత్వం నిర్లక్ష్యం

‌కన్నేపల్లి పంప్‌‌హౌస్‌ మోటార్ల ప్రారంభంపై ప్రభుత్వం నిర్లక్ష్యం

- Advertisement -


కేసీఆర్‌‌కు అప్పగిస్తే వారంలో నీరు 
 పారించి చూపుతారు : మాజీమంత్రి జగదీశ్‌‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

కన్నేపల్లి పంప్‌‌హౌస్‌లో మోటార్లను ప్రారంభం చేస్తే 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా, మొండిగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగదీశ్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి చేతగాకపోతే కాళేశ్వరాన్ని వారం రోజుల పాటు కేసీఆర్‌కు అప్పగిస్తే మొత్తం నీరు పారించి చూపుతామని వ్యాఖ్యానించారు. మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి చెప్తున్నట్టు ఏదైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నాటకం ఆడుతున్నదని విమర్శించారు. ఈ విషయంలో ఎన్డీఎస్ఏకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎస్‌ఎల్‌‌బీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు కాదు.. రూ.పది కూడా అవినీతిని తేల్చలేకపోయారని అన్నారు. ప్రభుత్వం వేసిన కమిషన్‌ను కోర్టు చెత్త బుట్టలో పడేసిందన్నారు. ఎల్‌నినో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంతో ఉందని చెప్పారు. ఎలాంటి కరువు నచ్చినా ప్రజలను బతికించడానికి ఆ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపారు. బ్యారేజీల నుంచి ఇసుక తవ్వి అధికార పార్టీ నాయకులు రూ.వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్‌కు ‌ప్రాజెక్టులపై ఎంత మాత్రం అవగాహన లేదన్నారు. నీటిని ఎత్తిపోయకపోతే మళ్లీ ఛలో కన్నేపల్లి, ఎల్లంపల్లికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదని గుర్తు చేశారు. మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికైనా ఇసుక లారీలు బంద్ చేయాలనీ, కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి తరలించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ‌నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ధర్మేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -