సన్నాహాల్లో అధికారులు
పలు అసెంబ్లీ కమిటీల నియామకం
సెలెక్ట్ కమిటీ చైర్మెన్‌గా
మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు సర్కారు సన్నద్ధమవుతున్నది. ఈనెలాఖరులో గానీ, ఆగస్టు తొలి వారంలో గానీ ఈ సమావేశాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాసన మండలి, శాసనసభ భవనాలకు సంబంధించి కొన్ని మరమ్మతులు, మరికొన్ని సుందరీకరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్టుగా అసెంబ్లీలో సెంట్రల్ హాల్‌ను నిర్మించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా అసెంబ్లీ భవనం సాంతం పునరుద్ధరిస్తున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సైతం ఈ విషయమై సమాలోచనలు చేస్తున్నారు. సమావేశాలు చేపడితే ఎప్పటి నుంచి, ఎన్నిరోజులు అనే విషయపై ఇంకా స్పష్టత లేదు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత బీఏసీ భేటీలోనే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే సంగతిపై స్పష్టత రానుంది. సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో మీడియా సలహామండలి కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే కొత్త విప్‌లు వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్‌కు అసెంబ్లీ ప్రాంగణంలో కొత్తగా చాంబర్లను కేటాయించారు. వారు ఇక నుంచి ఆయా కార్యాలయాల నుంచి పని చేస్తారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కేవలం వారం రోజులు మాత్రమే నిర్వహించేందుకు చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇదిలావుండగా ప్రతియేటా నియమించే అసెంబ్లీ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, శాసనమండలి కార్యదర్శి డాక్టర్ నర్సింహ్మచార్యులు ఆదేశాలు జారీ చేశారు. సెలెక్ట్ కమిటీ చైర్మెన్‌గా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియమితులయ్యారు.
ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మికాంతరావు, జి మధుసూదన్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మామిడాల యశస్వీని, దానం నాగేందర్, కోవా లక్ష్మి, కె.మాణిక్‌రావు, శ్రీరామ్ రావు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సబార్డినేట్ లేజిస్టేషన్ కమిటీ చైర్మెన్‌గా కడియం శ్రీహరితోపాటు మరో 10 మంది సభ్యులను నియమించారు. అలాగే సదుపాయాల కమిటీ చైర్మెన్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తోపాటు మరో 10 మంది ఎమ్మెల్యేలను నియామకం చేశారు. ఎస్సీల సంక్షేమ కమిటీ చైర్మెన్‌గా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మెన్‌గా పాయం వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ కమిటీ చైర్మెన్‌గా మక్కన్ సింగ్ రాజ్‌ఠాకూర్, గ్రంథాలయ కమిటీ చైర్మెన్‌గా మట్టా రాగమయి, మహిళా, శిశు, వికలాంగుల కమిటీ చైర్మెన్‌గా చిట్టెం పర్నికారెడ్డి, మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మెన్ లక్ష్మి కాంతరావు, వైల్డ్‌లైఫ్, పర్యావరణ కమిటీ చైర్మెన్‌గా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వ్యవహరించనున్నారు. కాగా పిటిషన్ల కమిటీ, ప్రివిలేజేస్ కమిటీ చైర్మెన్‌గా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మెన్‌గా పట్లోళ్ల సంజీవరెడ్డి, రూల్స్ కమిటీ చైర్మెన్‌గా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎధిక్స్ కమిటీ చైర్మెన్‌గా రేవూరి ప్రకాష్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం ఏడాది ఉంటుంది. లేదా కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే పనిచేస్తాయని అసెంబ్లీ వ్యవహారాలు చూసే అధికారులు చెప్పారు.
రాజ్యసభ ఎధిక్స్ కమిటీ రాక
రాజ్యసభ ఎధిక్స్ కమిటీ చైర్మెన్, ఇద్దరు సభ్యులు సోమవారం తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు. చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభా వ్యవహారాల మంత్రి డి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వీరి మధ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా సభల్లో సభ్యుల హుందాతనం, చర్చలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సైతం పాల్గొన్నారు.
నెలాఖరులో వర్షాకాల శాసనసభా సమావేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


