చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొలిసారి
మీడియా కమిటీకి ప్రత్యేక కార్యాలయం
ప్రారంభించిన చైర్మెన్, స్పీకర్, మంత్రులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీలో నూతన శకం ప్రారంభమైంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేష్‌తోపాటు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటీ కి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మీడియా కమిటీకి ప్రత్యేక కార్యాలయాన్ని ప్రభుత్వం కేటాయించింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి , శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలతో హైదరాబాద్‌లోని అసెంబ్లీలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. అది సోమవారం సాకారమైంది. అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ నరసింహ్మచార్యులు, మీడియా అడ్వైజరీ కమిటీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కార్యాలయం ఏర్పాటు పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. అసెంబ్లీ అడ్వైజరీ కమిటీ కోసం ప్రత్యేకంగా దేశంలో ఏ అసెంబ్లీలోనూ ప్రత్యేక కార్యాలయం లేకపోవడం గమనార్హం. పార్లమెంట్‌లో కూడా ఇలాంటి వసతి ఏర్పాటు చేయలేదు. తొలిసారి తెలంగాణ అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటీ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశారు. మీడియా అడ్వైజరీ కమిటీ కార్యాలయం ఇవాళ మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు డి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ప్రారంభించగా మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాసరెడ్డి ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కమిటీ చైర్మెన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో చైర్మెన్ పరిపూర్ణ చారి, కమిటి సభ్యులు బి. బసవపున్నయ్య, సురేఖ, అశోక్, అంజయ్య, రంగారావు, పూర్ణచందర్‌రావు, నాగేశ్వర్‌రావు , వజాహత్ పాల్గొన్నారు. ఈసందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మీడియా కమిటీకి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అసెంబ్లీ వార్తలు బాధ్యతతో కవర్‌చేయాలని సూచించారు. జర్నలిస్టులకు వసతి, సౌకర్యాలు కల్పంచడంలో ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు.
అసెంబ్లీ విప్‌లకు
చాంబర్ల కేటాయింపు
శాసనసభ విప్ వేముల వీరేశం, శాసనమండలి విప్ లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కార్యాలయాలను తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. అలాగే సోమవారం అసెంబ్లీలో నూతనంగా మీడియా ఎడ్వైజరీ కమిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాష్ ముదిరాజ్, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు మండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రులు డి శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి , రాజ్యాసభ సభ్యులు, సీఎం ప్రధాన సలహాదారు వేముల నరేందర్‌రెడ్డి విప్‌లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ అసెంబ్లీలో కొత్త శకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



