Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంఈ20తో మైలేజీ మాయం.. మరమ్మతుల భారం

ఈ20తో మైలేజీ మాయం.. మరమ్మతుల భారం

- Advertisement -

2023కు ముందు తయారైన పెట్రోల్‌ ‌వాహనాల్లో సమస్యలు?
వెహికిల్‌ ఓనర్స్‌‌లో తీవ్ర అసంతృప్తి
పది శాతానికి పైగా మైలేజీ తగ్గిందని 66 శాతం మంది వెల్లడి
మరమ్మతులు, విడిభాగాలు అరిగిపోయాయన్న 55 శాతం మంది
ప్రజల ఆందోళనలను పట్టించుకోని మోడీ సర్కారు
లోకల్‌‌సర్కిల్స్‌ తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు దేశవ్యాప్తంగా అమలు చేసిన ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్) కార్యక్రమంపై పాత పెట్రోల్ వాహనాల యజమానుల నుంచి అసంతృప్తి పెరుగు తోంది. 2023కు ముందు తయారైన వాహ నాలకు సంబంధించిన యజమానులపై నిర్వహించిన ‘లోకల్‌‌సర్కిల్స్‌’ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. మూడింటా రెండు వంతుల మంది యజమానులు తమ వాహనాల మైలేజీ 10 శాతానికి పైగా పడిపోయిందని తెలిపారు. ఇక సగానికి పైగా మంది మరమ్మతుల ఖర్చు పెరిగిందని వెల్లడిం చారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. పెట్రోల్ దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించడం, విదేశీ మారక వ్యయాన్ని ఆదా చేయడం, చెరకు రైతులకు మేలు చేయడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వినియోగాన్ని గతేడాది ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసింది. మొదట 2030 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించిన లక్ష్యాన్ని ఆరు సంవత్సరాల ముందుగానే అమలు చేసింది. అయితే ఈ నిర్ణయం పాత పెట్రోల్ వాహనాల యజమానులకు భారంగా మారిందని తాజా సర్వే వివరిస్తోంది. ‘లోకల్‌‌సర్కిల్స్‌’ నిర్వహించిన ఈ సర్వేలో 305 జిల్లాలకు చెందిన 44 వేల మందికిపైగా పెట్రోల్‌ ‌వాహనాల యజమానులు పాల్గొ న్నారు. వీరంతా 2022 లేదా అంతకంటే ముందు వాహనాలు కొనుగోలు చేసినవారు.

​ఈ సర్వేలో వాహన యజమానుల నుంచి తీవ్ర ఆందోళన, అసంతృప్తులు వ్యక్తమ య్యాయి. మైలేజీపై స్పందించిన 22,100 మందిలో.. 23 శాతం మంది మైలేజీ 20 శాతానికి పైగా తగ్గిందన్నారు. మరో 23 శాతం మంది 15-20 శాతం తగ్గిందని చెప్పారు. ఇంకో 20 శాతం మంది 10-15 శాతం మైలేజీ పడిపోయిందని వెల్లడించారు. మొత్తంగా 66 శాతం మంది తమ వాహనాల మైలేజీ 10 శాతానికి మించి తగ్గిందని తెలపడం గమనార్హం. కాగా మేలో నిర్వహించిన ఇదే సర్వేలో ఈ సంఖ్య 45 శాతంగా మాత్రమే ఉంది. అలాగే వాహనాల మరమ్మతులపై స్పందించిన 22,668 మందిలో… 24 శాతం మంది మరమ్మతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. మరో 21 శాతం మంది మోస్తరు స్థాయిలో పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పది శాతం మంది మరమ్మతులు స్వల్పంగా పెరిగాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో మొత్తం 55 శాతం మంది వాహనాల్లో అరిగిపోవడం, మరమ్మతుల అవసరం పెరిగిందని తెలిపారు. గత నెలలో ఈ సంఖ్య 29 శాతంగానే ఉండటం గమనార్హం.

​కారణాలేమిటి?
సర్వే ప్రకారం.. ఇథనాల్‌లో సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ5 లేదా ఈ10 ప్రమాణా లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పాత ఇంజిన్లు ఈ20కి అనుగుణంగా పనిచేయక పోవడంతో మైలేజీ తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఇథనాల్ తేమను ఎక్కువగా ఆకర్షించే స్వభావం కలిగి ఉండటంతో పాత వాహనాల్లోని లోహ, రబ్బరు భాగాలపై ప్రభావం చూపి తుప్పు, సీల్స్, హోజ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.

​అంగీకరించని కేంద్రం
ఈ ఆరోపణలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ అంగీకరించడం లేదు. ఈ20 పెట్రోల్‌‌తో దేశవ్యాప్తంగా ఇంజిన్‌లు దెబ్బతిన్నాయనే ఆధారాలు లేవనీ, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అనేక వాదనలు తప్పుదారి పట్టించేవేనని స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ20 పెట్రోల్‌కు కనీసం రీసెర్చ్‌ ఆక్టేన్‌ ‌నంబర్‌ (ఆర్‌ఓఎన్‌-95) ప్రమాణం అమలులోకి తీసుకువచ్చామనీ, పాత వాహనాలకు అనుకూలంగా ఆటో మొబైల్ కంపెనీలు సాంకేతిక పరిష్కారాలపై పనిచేస్తున్నాయని తెలిపింది.​వ్యత్యాసం స్పష్టంఅయితే వినియోగదారుల అనుభవాలు, ప్రభుత్వ వాదనల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని లోకల్‌‌సర్కిల్స్‌ పేర్కొంది. అందుకే 2023కు ముందు కొనుగోలు చేసిన వాహనాల యజమానులకు ఈ5 లేదా ఈ10 పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలనీ, అలాగే పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ శాతాన్ని స్వతంత్ర సంస్థలతో తరచుగా తనిఖీ చేయించాలని సిఫారసు చేసింది. ఈ సర్వే కేంద్ర ప్రభుత్వ విధానంపై చర్చకు కొత్త ఊతమిచ్చింది. ఇంధన దిగుమతులు తగ్గించడం ఎంత ముఖ్యమో, కోట్లాది మంది వాహనదారులపై పడుతున్న అదనపు భారం కూడా అంతే ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ ఆందోళనలపై స్వతంత్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించి, అవసరమైతే విధానాన్ని పున:సమీక్షించాలని దేశంలోని పెట్రోల్‌ ‌వాహనదారుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -