ఫిఫా 2026 ప్రపంచకప్
వాంకోవర్ (కెనడా) : ఫిఫా 2026 ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఆఖరు ప్రీ క్వార్టర్‌ఫైనల్లో కొలంబియాపై స్విట్జర్లాండ్ విజయం సాధించి ముందంజ వేసింది. వాంకోవర్‌లో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా, స్విట్జర్లాండ్‌లు నిర్ణీత 90 నిమిషాల ఆటతో పాటు అదనపు సమయంలోనూ గోల్ సాధించలేకపోయాయి. దీంతో విజేతను పెనాల్టీ షూటౌ ట్ ద్వారా తేల్చారు. షూటౌట్లో స్విట్జర్లాండ్ 4-3తో కొలంబియాను ఓడించింది. స్విస్ ఆటగాళ్లు ఐదు పెనాల్టీల్లో నాలుగింటిని గోల్స్‌గా మలచగా.. కొలంబియా ఆటగాళ్ల రెండు పెనాల్టీలను స్విస్ గోల్ కీపర్ నిలువరించాడు. దీంతో స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రపంచకప్ సెమీఫైనల్లో చోటు కోసం స్విట్జర్లాండ్‌తో అర్జెంటీనా, బెల్జియంతో స్పెయిన్, నార్వేతో ఇంగ్లాండ్, మొరాకోతో ఫ్రాన్స్ తలపడనున్నాయి.
క్వార్టర్స్‌కు స్విట్జర్లాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



