Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంఫీజు వివరాలు 
తప్పనిసరిగా ప్రదర్శించాలి

ఫీజు వివరాలు 
తప్పనిసరిగా ప్రదర్శించాలి

- Advertisement -

ప్రయివేటు పాఠశాలలకు
మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
చెన్నై :
తమిళనాడులోని అన్ని ప్రయివేట్ పాఠశాలలు తమ ఫీజుల వివరాలను నోటీసు బోర్డులు, వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలని మద్రాస్‌ ‌హైకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన ఫీజు నిర్ధారణ కమిటీ ద్వారా నిర్ధారించబడిన ఫీజుల వివరాలను అన్ని ప్రయి వేట్ పాఠశాలలు తమ నోటీసు బోర్డులు, వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు ఆప్‌‌డేట్‌ ‌చేసేలా ప్రయివేట్ పాఠశాలల డైరెక్టర్ తనిఖీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రయివేట్ పాఠశాలల (నియంత్రణ) చట్టం 2019 పరిధిలోకి వచ్చే అన్ని పాఠశాలలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కమిటీ నిర్ధారించిన ఫీజులతో పాటు, సంబంధిత అధికార సంస్థ ఆమోదించిన ఇతర ఫీజులను కూడా ప్రదర్శించాలని హైకోర్టు పేర్కొంది. చెన్నైకి చెందిన ఆల్ ఇండియా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేషన్ (ఏటీఎస్‌ఐసీ) ప్రధాన కార్యదర్శి కె. పళనియప్పన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నిజానికి ఈ పిటిషన్‌ అన్ని ప్రయివేటు పాఠశాలలు తమ నోటీసు బోర్డులపై ఫీజుల వివరాలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రయివేట్ పాఠశాలల డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలయింది. ప్రయివేట్ అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థలకు సర్క్యులర్‌ వర్తించదని ఈ పిటిషన్‌ వాదించింది. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాల నుంచి గణనీయమైన ఆర్థిక సహాయం లేదా నియంత్రణలేని ప్రయివేట్ విద్యా సంస్థలు ‘పబ్లిక్ అథారిటీ’ పరిధిలోకి రావనే అసోసియేషన్‌ వాదనతో హైకోర్టు కూడా ఏకీభించింది. అయినప్పటికీ, ప్రయివేట్ పాఠశాలలు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన చట్టం పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ, పాఠశాలలు తమ ఫీజుల వివరాలను బహిరంగపరచడానికి కట్టుబడి ఉండాలని చెబుతూ, తన అసాధారణ అధికార పరిధిని ఉపయోగించి హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తమ పిల్లల కోసం మంచి పాఠశాలను ఎంచుకోవాలనుకునే తల్లిదండ్రులు, ఆయా పాఠశాలలు వసూలు చేసే ఫీజుల వివరాలను పారదర్శకంగా తెలుసుకోగలగాలని, తద్వారా వారు సరైన నిర్ణయం తీసుకోగలరని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే పిల్లలను చేర్పించిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితిని నివారించుకోగలరని హైకోర్టు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -