Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాపాలనలో అభివృద్ధి, సంక్ష‍ేమం

ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్ష‍ేమం

- Advertisement -

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి
వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ – వనపర్తి

ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్ష‍ేమానికి సమాన ప్రాధాన్యత ఉంటుందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్‌ ‌కే.శివసేనారెడ్డితో కలిసి బుధవారం
వనపర్తి జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంస్థాపన చేశారు. వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిధిలో రూ.2కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధి ద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పనులు చేపట్టనున్నట్టు మంత్రులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రాజా బంగ్లా పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. పునరుద్ధరణతో పురాతన రాజ భవనానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. అదేవిధంగా రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రేవల్లి మండల కాంప్లెక్స్‌ సముదాయ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)ఎన్‌.ఖీమ్యా నాయక్‌, ఎస్పీ డి.సునీత రెడ్డి, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వినోద్‌ కుమార్‌, ఆర్డీఓ సుబ్రమణ్యం స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో వనపర్తి మున్సిపల్‌ చైర్‌ ‌పర్సన్‌ మాధవి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ గోవర్ధన్‌ సాగర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -