Thursday, July 9, 2026
E-PAPER
Homeఆటలువిజయంతో ముగిస్తారా?

విజయంతో ముగిస్తారా?

- Advertisement -

నేటి నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ మహిళల ఏకైక టెస్టు
మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో

లార్డ్స్‌ (‌లండన్‌) : ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్‌ ‌పర్యటనకు వెళ్లిన టీమ్‌ ఇండియా మహిళల జట్టు.. ఇంగ్లాండ్‌‌పై తొలి టీ20లో విజయంతో టూర్‌‌ను ఘనంగా ఆరంభించింది. ఆ తర్వాత టీ20 సిరీస్‌‌లో ఓటమి, టీ20 ప్రపంచకప్‌‌ నుంచి గ్రూప్‌ ‌దశలోనే నిష్క్రమించటం హర్మన్‌‌ప్రీత్‌‌సేనకు కుంగదీసింది. సుదీర్ఘ ఇంగ్లాండ్‌ ‌పర్యటనను రెడ్‌బాల్‌ ‌ఫార్మాట్‌తో ముగించనున్న బారత్‌ ‌నేటి నుంచి ఆతిథ్య ఏకైక టెస్టులో ఇంగ్లిశ్‌ అమ్మాయిలతో తలపడనుంది. విజయంతో ఇంగ్లాండ్‌‌ను మొదలెట్టిన భారత్‌.. విజయంతోనే ముగిస్తారా? లేదంటే.. మరో ఓటమితో ఇంటిబాట పడతారా? అనేది చూడాలి. భారత్‌, ఇంగ్లాండ్‌ ‌మహిళల ఏకైక టెస్టు నేటి నుంచి లార్డ్స్‌‌లో ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ ‌మధ్యాహ్నం 3.30 గంటలకు ఆరంభం కానుంది.

​మనోళ్లదే పైచేయి!
టెస్టుల్లో ఇంగ్లాండ్‌‌పై భారత్‌‌కు మంచి రికార్డుంది. 2023లో జరిగిన ఏకైక టెస్టులోనూ భారత్‌ ‌విజయం సాధించింది. ఇంగ్లాండ్‌‌తో చివరి ఐదు టెస్టుల్లో మూడింట భారత్‌ ‌గెలుపొందగా.. రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. ‌టీ20 ప్రపంచకప్‌ ఓటమి నుంచి బయటపడి.. టెస్టుల్లో సత్తా చాటేందుకు అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు. హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌, స్మృతీ మంధాన, హర్లిన్‌ ‌డియోల్‌, రిచా ఘోష్‌, స్నేహ్‌ ‌రానా, షెఫాలీ వర్మలు భారత్‌‌కు బ్యాట్‌‌తో కీలకం కాన్నారు. దీప్తి శర్మ, క్రాంతి గౌడ, శ్రీ చరణి, రేణుక సింగ్‌‌లు బంతితో కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌ అమ్మాయిలు సైతం నైరాశ్యంలోనే ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌ ‌ఫైనల్లో ఆస్ర్టేలియా చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్‌… ఏకైక టెస్టులో విజయంతో ఊరట పొందాలని చూస్తోంది. నటాలీ సీవర్‌ ‌బ్రంట్‌, టామీ బ్యూమోంట్‌, లారెన్‌ ‌బెల్‌, ఆమీ జోన్స్‌, హీథర్‌ ‌నైట్‌, సోఫి ఎకెలస్టోన్‌లు ఆతిథ్య ఇంగ్లాండ్‌‌కు కీలకం కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -