Saturday, July 11, 2026
E-PAPER
Homeఆటలుఎంబాపె మెరువగా..

ఎంబాపె మెరువగా..

- Advertisement -

సెమీఫైనల్లో ఫ్రాన్స్‌
మొరాకోపై 2-0తో గెలుపు
ఫిఫా 2026 ప్రపంచకప్‌

బోస్టన్‌ (‌యుఎస్‌ఏ) : 2022 ఫిఫా ప్రపంచకప్‌ ‌రన్నరప్‌, టైటిల్‌ ‌ఫేవరేట్‌ ‌ఫ్రాన్స్‌ అదరగొట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో మొరాకోపై 2-0తో ఘన విజయం సాధించింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, ఫార్వర్డ్‌ ‌కిలియన్‌ ఎంబాపె ప్రపంచకప్‌‌లో ఎనిమిదో గోల్‌‌తో మెరువగా.. మొరాకోకు పరాభవం తప్పలేదు. అగ్రజట్టు ఫ్రాన్స్‌‌ను మొరాకో ప్రథమార్థంలో నిలువరించింది. గోల్‌ ‌లేకుండానే తొలి 45 నిమిషాల ముగిసింది. ద్వితీయార్థంలో దూకుడు పెంచిన ఫ్రాన్స్‌ ‌ప్రత్యర్థి గోల్‌ ‌పోస్ట్‌‌పై దాడులు చేసింది. 60వ నిమిషంలో పెనాల్టీ ఏరియా నుంచి ఎంబాపె గోల్‌ ‌కొట్టగా.. బంతి గింగిరాలు తిరుగుతూ గోల్‌‌పోస్ట్‌లో పడింది. దీంతో ఫ్రాన్స్‌ 60‌వ నిమిషంలో 1-0తో ఆధిక్యం సాధించింది. ఆరు నిమిషాల తర్వాత ఎంబాపె అందించిన పాస్‌‌తో ఒస్మానె డెంబెలె గోల్‌ ‌చేశాడు. 2-0తో ఫ్రాన్స్‌ ‌తిరుగులేని ముందంజ వేసింది. అంతకుముందు, ఎంబాపె ఫ్రి కిక్‌‌ను గోల్‌‌గా మలచటంలో విఫలమయ్యాడు. అయినా, తనదైన మ్యాజిక్‌‌తో గోల్‌ కొట్టి, మరో గోల్‌ ‌కొట్టేందుకు సహకారం అందించి ఫ్రాన్స్‌‌కు విజయాన్ని అందించాడు. బెల్జియం, స్పెయిన్‌ ‌క్వార్టర్‌‌ఫైనల్‌ ‌విజేతతో సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ ‌తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -