- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దైవాలగూడలో ఆరుగురి హత్యలపై తాజాగా సీపీ తరుణ్ జోషి స్పందించారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై మే 16 కేసు నమోదైందని తెలిపారు. అనంతరం అతడు పరారయ్యాడని, అప్పటి నంచి అతడి కోసం గాలించామని అన్నారు. తర్వాత రాజ్‌కుమార్ బెయిల్ వచ్చి బయటకు వచ్చాడని.. అతడికి రెండు, మూడుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని, రాజ్‌కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు. అతడికి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలవాటు కూడా ఉందని తెలిపారు. మరోవైపు భార్య, పిల్లల హత్యపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజ్‌కుమార్ కోసం 7 టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.
- Advertisement -


