నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని శ్రీనివాస టెర్రి కాటన్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం నూతన కార్యవర్గం కొలువుదీరింది. సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎండి జమాలుద్దీన్ పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియలో, సభ్యులు ఏకగ్రీవంగా తమ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా మంత్రి రాజేందర్ ఎన్నికవ్వగా, ఉపాధ్యక్షుడిగా దార్నా వేణుగోపాల్, కార్యదర్శిగా పోరండ్ల రాజేందర్, పేగడ సంపత్ బాధ్యతలు చేపట్టారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా తౌట భాగ్యమ్మ, వంగర సుమలత, దాసరి రమేష్, దుంపేటి సాంబయ్య, వావిలాల రవీందర్ ఎన్నికయ్యారు. అంతకుముందు జరిగిన ఎన్నికల ప్రక్రియలో తొమ్మిది మంది డైరెక్టర్లను సభ్యులు ఎన్నుకోగా, వారి ద్వారానే ఈ నూతన కమిటీని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన ప్రతినిధులకు సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు పేర్కొన్నారు.
శ్రీనివాస టెర్రి కాటన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి రాజేందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



