Saturday, July 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నా: సర్పచ్

గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నా: సర్పచ్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మాపై ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి గ్రామాభివృద్దికి కట్టుబడి ఉంటామని గ్రామ సర్పంచ్ మొరే పల్లవి దత్తహరి అన్నారు. శనివారం కుభీర్ మండల పరిధిలోని గోడపూర్ గ్రామ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, దీనివల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన సర్పంచ్ రోడ్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. దింతో పాటు ముఖ్యంగా గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ కొనసాగుతుందని, గ్రామమలోని ప్రతి ఒక్కరు ఎస్ ఐ ఆర్ ఫారం తప్పులు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. వీటిని స్తానిక బీఎల్ఓలకు అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి కవిత, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -