Saturday, July 11, 2026
E-PAPER
Homeకరీంనగర్ఇటిక్యాలలో ఇసుక మాఫియాకు షాక్

ఇటిక్యాలలో ఇసుక మాఫియాకు షాక్

- Advertisement -
  • ఆరు ట్రాక్టర్లు సీజ్..భారీ డంపు స్వాధీనం
    నవతెలంగాణ – రాయికల్
    మండలంలోని ఇటిక్యాల గ్రామ శివారులో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు.అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపుతో పాటు ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను సీజ్ చేశారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది గ్రామ శివారులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేయడంతో పాటు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారు.వెంటనే స్పందించిన అధికారులు ఇసుక డంపును స్వాధీనం చేసుకుని,రవాణాకు వినియోగిస్తున్న ఆరు ట్రాక్టర్లను సీజ్ చేశారు.

అక్రమ ఇసుక నిల్వలు,రవాణాకు సంబంధించిన వివరాలను జిల్లా మైనింగ్ అధికారులకు పంపించినట్లు తహసీల్దార్ నాగార్జున తెలిపారు.మైనింగ్ శాఖ నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని,సహజ వనరుల దోపిడీకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.గ్రామాల్లో ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకాలు,నిల్వలు,రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో కీలక పాత్ర పోషించిన ఆర్‌ఐ పద్మయ్య,దేవదాస్,జీపీఓల బృందాన్ని తహసీల్దార్ నాగార్జున అభినందించారు.అక్రమ ఇసుక రవాణాపై ఇలాంటి దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -