- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో 15 మంది మరణించగా.. వారిలో 10 మంది తమిళనాడుకు చెందిన వారేనని తెలిసింది. మిగతా వారిలో ముగ్గురిని ఏపీ, ఇద్దరిని కేరళకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, హిందూపురానికి చెందిన రవితేజ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం వివరాలు వెల్లడించింది.
- Advertisement -


