Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ వేగవంతం చేయాలి

ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ వేగవంతం చేయాలి

- Advertisement -

–   అడిషనల్ కలెక్టర్ ఎన్.వై. గిరి
నవతెలంగాణ-కామారెడ్డి : ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్.వై. గిరి అధికారులను ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు పరిధిలో కాకతీయ నగర్ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లు పూరించిన ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే స్వీకరించిన ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగంగా చేపడుతున్నామని, మిగిలిన ఫారాలను సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నారని అధికారులు వివరించారు. ఈ నెల 24వ తేదీ నాటికి అన్ని ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ పూర్తి చేసి, యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్‌ పనులు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. ఏదైనా కారణంతో ఎన్యూమరేషన్‌ ఫారాలు ఓటర్లకు అందకపోతే వాటిని తిరిగి రూపొందించి (రీజనరేట్‌ చేసి) వెంటనే అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ హిమబిందు, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ హన్మంతరావు, 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత, బీఎల్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -