Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్

బాధిత కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన దివంగత చింతాల రమేష్ కుటుంబంతో పాటు ఎస్సీ కాలనీకి చెందిన మున్సిపల్ కార్మికురాలు దివంగత సైదుగాని దుర్గవ్వ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్ప శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యం చెప్పారు. అనంతరం రమేష్, దుర్గవ్వ కుటుంబాలకు కలిపి మొత్తం రూ.15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండడమే తన లక్ష్యమని, భవిష్యత్తులో అవసరమైన ప్రతి సందర్భంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బబ్లు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుందారపు రాజనర్సు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమీర్, స్వామి, ప్రశాంత్, మహబూబ్, రాములు, మున్సిపల్ కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -