– పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలొ అధికారులు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్, అది నాకు కలెక్టర్ ఎన్ వి గిరి అతిథులుగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గిరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ నిట్టు గంగాధర్, శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సేవా ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అధికారులు, నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


