Sunday, July 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులు చదువులో రాణించాలి

విద్యార్థులు చదువులో రాణించాలి

- Advertisement -

– ఎస్ ఐ బిట్ల పెర్సిస్
నవతెలంగాణ-ముధోల్ : విద్యార్థులు చదువులో రాణించాలని ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ అన్నారు. ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో ఆదివారం రాత్రి  బాలుర వసతిగృహంలో  ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు లో ఆమె మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదువుకొని, విద్యలో రాణించినప్పుడే తల్లిదండ్రులకు గుర్తింపు ఉంటుంది అన్నారు. విద్యా చట్టాల గురించి ఎస్ఐ తెలియజేశారు. విద్యార్థులు తమ ఇంటి వద్ద ఉన్నప్పుడు సెల్ ఫోన్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల మీతోపాటు, తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్ప వద్దన్నారు. హాస్టల్లో విద్యార్థులు కలిసిమెలిసి ఉండాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే వసతిగృహ అధికారితో పాటు, తనకు తెలియజేయాలని అన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మైనర్ విద్యార్థులు మోటార్ సైకిల్ ను నడప వద్దన్నారు. పోలీసులు నిరంతరం ప్రజల కోసం పని చేస్తారన్నారు. అనంతరం హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వసతిగృహ అధికారి ఫిరోజ్, సర్పంచ్ రామచందర్ రెడ్డి, ఉప సర్పంచ్ భూమన్న, నాయకులు ఉదయ్, వార్డు సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -