Friday, September 11, 2026
E-PAPER
Homeఖమ్మంఅచ్యుతాపురంలో దోమల నివారణ చర్యలు: సర్పంచ్ పోలయ్య

అచ్యుతాపురంలో దోమల నివారణ చర్యలు: సర్పంచ్ పోలయ్య

- Advertisement -




– ప్రజారోగ్యమే లక్ష్యం

నవతెలంగాణ అశ్వారావుపేట

మండలంలోని పలు గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, కీటకజనిత వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అచ్యుతాపురం గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. ఆదివారం గ్రామ సర్పంచ్ పోలయ్య పర్యవేక్షణలో గ్రామ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో ఫాగింగ్ నిర్వహించారు. అలాగే ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పోలయ్య మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని నివారణ చర్యలను నిరంతరం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పాకనాటి నాగేశ్వరరావు, గ్రామ గుమాస్తా కొనకళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -