నవతెలంగాణ-ఆలేరు టౌన్ : ఆలేర్ పట్టణంలో ఆదివారం క్రాంతి నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా వినీత్ సామల ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా, కొమ్ము శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత సంవత్సరాల కంటే మరింత వైభవంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.
క్రాంతి నగర్ ప్రజలు, యువత, దాతలు మరియు భక్తులందరూ ఈ మహోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఇరువురిని కిలిమంజారో శిఖర అధిరోహితుడు బీర్కూరి ప్రదీప్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సభ్యులు కృత నిశ్చయంతో పని చేయాలని కోరారు.


