- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టైఫూన్ ‘బావి’ ప్రభావంతో ఈశాన్య చైనాలోని పలు ప్రాంతాలు తీవ్ర వర్షాలు, బలమైన ఈదురుగాలులతో అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా లియావోనింగ్ ప్రావిన్స్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం దృష్ట్యా సుమారు 2.6 లక్షల మందిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో రవాణా సేవలకు అంతరాయం ఏర్పడగా, సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
- Advertisement -



