Tuesday, March 10, 2026
E-PAPER
Homeసినిమాస్వచ్ఛమైన ప్రేమకథ

స్వచ్ఛమైన ప్రేమకథ

- Advertisement -

‘ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌’ నుంచి తొలి గీతంగా రచయిత గోరేటి వెంకన్న రచించిన ‘సంచారమే’ పాటను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హదయాన్ని తాకే భావాలతో ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఈ గీతానికి హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు. బ్లాక్‌బస్టర్‌ ‘బేబీ’ తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
‘నైన్టీస్‌’ వెబ్‌ సిరీస్‌తో అందరి మనసులు దోచుకున్న దర్శకుడు ఆదిత్యహాసన్‌, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ‘ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌’ను భావోద్వేగాలతో కూడిన మదువైన ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణించారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, ఛాయాగ్రహణం: అజీమ్‌ మహమ్మద్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఫణి కె వర్మ, సహ నిర్మాతలు: వెంకట్‌ ఉప్పుటూరి, వీఎంఆర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -