న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయులకు సమన్లు
న్యూయార్క్ : న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెందిన పాత్రికేయులకు అమెరికా అధికారులు సమన్లు జారీ చేశారు. వీటి ప్రకారం కోర్టు లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ ముందు హాజరై సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. లేదా అవసరమైన పత్రాలను సమర్పించాలి. దీనిని పాటించకపోవడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఈ సమన్లనే అమెరికాలో ‘సబ్‌పోనాలు’ అంటారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటంటే…అమెరికాకు ఇటీవలే ఖతార్ ఓ ఎయిర్‌ఫోర్స్ విమానాన్ని బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ విమానంలో భద్రతకు సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన ఐదుగురు పాత్రికేయులు వార్తలు రాశారు. దీంతో ఆగ్రహించిన అధికారులు వారికి సమన్లు జారీ చేశారు. ప్రభుత్వ చర్యపై మీడియా ప్రపంచం తీవ్రంగా స్పందించింది. స్వతంత్ర మీడియా సంస్థలను నియంత్రించి, భయపెట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రచారంలో ఇది ఓ ఎత్తుగడ అని పలువురు మీడియా ప్రముఖులు విమర్శించారు. ఈ సమన్లు జర్నలిస్టుల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పాత్రికేయుల పరిరక్షణ కమిటీ ప్రతినిధి జోడీ గిన్స్‌బర్గ్ ధ్వజమెత్తారు.
ట్రంప్ ఆగ్రహానికి గురైన వార్తా సంస్థలపై న్యాయస్థానాలలో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. కొన్నిచోట్ల దాడులు కూడా జరుగుతు న్నాయి. అధికార కేంద్రాలలోకి మీడియా ప్రవేశాలను అడ్డుకుంటున్నారు. వాషింగ్టన్‌లో ఓ పాత్రికేయుడి ఇంటిని ఫెడరల్ ఏజెంట్లు సోదా చేశారు. ప్రభుత్వం కోరుకుంటున్న కథనానికి భిన్నంగా వార్తలు రాసే జర్నలిస్టు లను భయపెట్టడానికి, వారిని రాక్షసులుగా చిత్రీకరించడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకోవడం సర్వసాధారణమైంది. తాజాగా జారీచేసిన సమన్లు అత్యంత ప్రమాకరమైనవి, అసాధారణమైనవి. తన అజెండాకు వ్యతిరేకంగా వార్తలు రాసే సంస్థల విషయంలో ట్రంప్ విముఖత ప్రదర్శి స్తుంటారు.తనకు నచ్చని కథనాలు రాసే వార్తాసంస్థలపై దావాలు వేయడం తో పాటు టీవీ ప్రసార హక్కులను కూడా రద్దు చేస్తానని బెదిరించారు. ఉదాహరణకు ఏబీసీకి చెందిన ‘ది వ్యూ’ కార్యక్రమంపై కక్షసాధింపు చర్య లకు పూనుకున్నారు. ది టైమ్స్, అసోసియేటెడ్ ప్రెస్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి వార్తా సంస్థలు న్యాయస్థానాలలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రశ్నించిన నేరానికి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



