Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహమ్మదాబాద్ లో ఎస్ఐఆర్ ఆన్ లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ

మహమ్మదాబాద్ లో ఎస్ఐఆర్ ఆన్ లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో బుధవారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సుర్నార్ శకుంతల బాలు సంయుక్తంగా ఎస్ఐఆర్ ఫారాల ఆన్ లైన్ ప్రక్రియను పరిశీలించారని కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు. గ్రామంలో ఓటరు జాబితా సవరణ ఆన్ లైన్ ప్రక్రియ ఇంటింటికీ పంపిణీ చేయాలని, త్వరితగతిన ఈ ప్రక్రియను తప్పులు దొర్లకుండా పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జిపి కార్యవర్గ సభ్యులు, గ్రామము లోని విద్యావంతులైన యువకులు, మహిళా సంఘాల సభ్యులు సహకారం అందించాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -