నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ జవహర్ నగర్‌లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఉచిత నేత్ర పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మం శరత్ మాక్స్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఖమ్మం తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని మ్యాక్స్ విజన్ సంస్థ సిబ్బంది తెలిపారు. ఈ శిబిరంలో శరత్ మాక్స్ విజన్ సిబ్బంది విక్రమ్ సింగ్, అనిల్, కరుణ, లెనిన్ పాల్గొని సేవలందించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఏయస్ ప్రకాశరావు, అద్దంకి వెంకటరత్నం రామిశెట్టి సుబ్బారావు, బూరుగు దాసు, యోగానందం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



