Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల దమనకాండ

బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల దమనకాండ

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం పోలీసుల దమనకాండ కొనసాగింది. ప్రజాస్వామ్య బద్దంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ లో నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులపై ఉక్కు పాదం మోపింది. ఉదయం నుంచి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలతో పాటు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్ లోని తన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేయాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించారు. శాంతియుతంగా నిరసన చేయాలని తలపెట్టగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉదయం నుంచి నిర్బంధాలతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -