నవతెలంగాణ-ఆలేరు టౌన్
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర గౌరవాద్యక్షులు, విప్లవ సాంస్కృతి కోద్యమ యోధుడు, అమరుడు అరుణోదయ నాగన్న సంతాప సభ జూలై 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, సాంస్కృతిక రంగంలో విప్లవ కళారంగంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శికిలం కుమారస్వామి పిలుపునిచ్చారు.
ఆలూరు పట్టణంలో బుధవారం రైల్వే గేట్ సెంటర్ లో నాగన్న సంతాప సభ విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్, గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాగన్న గత అయిదు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని గుర్తు చేశారు. అమర కళాయోధుని సంతాప సభకు అన్ని వర్గాల ప్రజలు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.జనార్ధన్, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్, పీ ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత,ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మ సుదర్శన్, గడ్డం నాగరాజు, పీ వై ఎల్ జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారుజోడు సిద్దేశ్వర్, సాదుల శ్రీకాంత్,జిల్లా ప్రజా సంఘాల నాయకులు చిర బోయిన కొమురయ్య, గడ్డం మంకయ్య,శికిలం వెంకటేష్,నమిలే స్వామి, వంగాల నర్సింహారెడ్డి, తలారి వెంకటేష్,మేకల వెంకటేష్, బుడిగే ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.



