Wednesday, July 15, 2026
E-PAPER
Homeఖమ్మంవిశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం

విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి మున్సిపాలిటీ జవహర్ నగర్‌లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఉచిత నేత్ర పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మం శరత్ మాక్స్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఖమ్మం తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని మ్యాక్స్ విజన్ సంస్థ సిబ్బంది తెలిపారు. ​ఈ శిబిరంలో శరత్ మాక్స్ విజన్ సిబ్బంది విక్రమ్ సింగ్, అనిల్, కరుణ, లెనిన్ పాల్గొని సేవలందించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఏయస్ ప్రకాశరావు, అద్దంకి వెంకటరత్నం ​రామిశెట్టి  సుబ్బారావు, బూరుగు దాసు, యోగానందం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -