నవతెలంగాణ-ఆర్మూర్
జూలై 1 నుండి విబిజి రాంజీ పథకం అమలైందని మండల అభివృద్ధి అధికారి శివాజీ బుధవారం తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయిలో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. 2047 వరకు దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టంలో 60% కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూరుస్తాయని అన్నారు. ఈ చట్టం నాలుగు రకాల పనులు ఉన్నాయని, అవి వాటర్ సెక్యూరిటీ, గ్రామస్థాయిలో మౌలిక సదుపాయన కల్పన, జీవనోపాధి కార్యక్రమం, విపత్తు నిర్వహణకు సంబంధించి 318 రకాల పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందడానికి అన్ని రకాల పనులు ఈ చట్టంలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామస్థాయిలో ఈ చట్టాన్ని అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


