Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తపస్వి స్వచ్చంద సంస్థ విద్యార్థులకు బస్తీ దవాఖాన వైద్యురాలు ప్రీతి బుధవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని తెలిపారు. నూలుపురుగుల నివారణకు ఈ మాత్రలు సమర్థవంతంగా పనిచేస్తాయని తపస్వి ఫౌండర్ పద్మావతి చెప్పారు. ప్రతిరోజు భోజనానికి ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ మాత్రలతో రక్తహీనతతో పాటు పలు రకాల వ్యాధులను నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు  శ్రీనివాస్, ప్రెసిడెంట్ సుశీలా, అడ్మిన్ ఇంచార్జి కవిత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -