వచ్చే నెల 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పొడిగించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం సవరించింది. వచ్చే నెల 3వరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించనున్నట్టు తెలిపింది. దీంతో బీఎల్ఓల ఇంటింటి సర్వే గడువును పొడిగించినట్టయ్యింది. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్ 8 వరకు ఈసీఐ తుదిగడువు విధించింది. అక్టోబర్ 12న తుది ఓటరు జాబితాను ప్రచురించనుంది. సర్ గడువును పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో సర్ షెడ్యూల్‌ను సీఈసీ సవరించింది.
సర్ గడువు పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



