- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తన తాత, కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు(82) పార్థివ దేహాన్ని సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్‌లోని నివాసానికి తీసుకువస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఆయన అంత్యక్రియలను మార్చి 12న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
కావూరు సాంబశివరావు(82) బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
- Advertisement -



