నవతెలంగాణ-డిచ్ పల్ల
ఇందల్ వాయి మండలంలోని దేవి తాండ జాతియా రహదారికి అనుకుని నూతనంగా నిర్మించిన చాయ్ బంక్ కేఫ్ ను మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ .. వ్యాపారంలో దినాభి దినం అభివృద్ధి చెందాలని ఆ దిశగా తమ హోటల్కు వచ్చే వారికి నాణ్యత పాటిస్తూ రుచికరమైన వంటలు అందజేస్తూ వృద్ధి చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి కానుకొని గ్రామానికి కొద్దిగా దూరంలోనే చాయి బంక్ కేఫ్ నెలకొల్పడంతో చుట్టుపక్కల ఉన్న గిరిజన తాండలు గ్రామాల నుండి ప్రజలకు దగ్గరగా ఉంటుందని ఇదే కాకుండా ఉదయం పూట టిఫిన్ భోజనం స్నాక్స్ తదితర భోజనాలు టిఫిన్లు అందుబాటులో ఉండడంతో రహదారి వెంట అచ్చిపోయేవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అనంతరం చాయ్ బంక్ కేఫ్ యజమాని షేక్ షాదుల్లా, మహబూబ్ షెక్ , అంబర్ సింగ్ ల ఆధ్వర్యంలో పూల బోకే శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి గంగాదాస్, రూరల్ ఎస్పీ కన్వీనర్ పాశం కుమార్, చంద్రయాన్ పల్లి సర్పంచ్ అరటి రఘు, మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, తిర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి చింతల దాస్, నాయకులు సంగెం కిష్టయ్య, రామ్ రెడ్డి, అంబర్ సింగ్, తోపాటు ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు,తండా ప్రజలు పాల్గొన్నారు.
చాయ్ బంక్ కేఫ్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



