Wednesday, March 11, 2026
E-PAPER
Homeఖమ్మంలేబర్ కోడ్ లు అమలుతో నియంతలు కానున్న యజమానులు

లేబర్ కోడ్ లు అమలుతో నియంతలు కానున్న యజమానులు

- Advertisement -

– కార్మిక హక్కులు కు భంగం
– సీఐటీయూ నాయకులు అర్జున్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు అమలులోకి వస్తే యజమానులు నియంత లు గా మారి కార్మిక హక్కులు కు భంగం కలిగిస్తారు అని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పిట్టల అర్జున్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు పావులు కదుపుతుంది అని,కార్మికులకు నష్టం కలిగించే ఈ లేబర్ కోడ్ లను అమలు చేయబోమని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేసారు. బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో కే.భారతి అధ్యక్షతన సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కార్మిక శాఖ యజమానులు శాఖగా కాకుండా కార్మికుల పక్షాన నిలిచే శాఖగా ఉండాలని అప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటే కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుందని అన్నారు.లేబర్ కోడ్ ల అమల వల్ల కార్మికుల హక్కుల కు భంగం కలుగుతుందని శ్రమ దోపిడీ పెరుగుతుందని అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లోనే లేబర్ కోడ్ లు అమలు చేయబోమని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే కాంగ్రెస్ న ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కన్వీనర్ కేసు పాక నరసింహారావు, విష్ణు కుమారి,ఏసు,దేవి,భూదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -