Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదామిని పాత్ర అలరిస్తుంది..

దామిని పాత్ర అలరిస్తుంది..

- Advertisement -

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీడియా సమావేశంలో పలు సినిమా విశేషాలు పంచుకున్నారు- దర్శకుడు భరత్ దర్శన్ చెప్పిన కథ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇందులో నేను చేసిన దామిని పాత్రకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ముట్టు కుంటే షాక్ కొడతాను(నవ్వుతూ) అది చాలా ఆసక్తికరంగా ఉంటూనే అందర్నీ అలరిస్తుంది. ఇది దామిని కథ. ఆ పాత్ర ప్రయాణాన్ని ప్రేక్షకులు ఎంతో ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను.ఇందులో తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలు కనే యువకుడిగా కనిపిస్తారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఎవరికీ ముందు కొడుకు పుడితే అతనికే ఆస్తి రాస్తానని తండ్రి నిర్ణయిస్తాడు. అదే సమయంలో నేను తనకి పరిచయం అవుతాను. నేను ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మా యిని. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే కథ. సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయి.- మహేశ్వర్ రెడ్డి అభిరుచిగల నిర్మాత. ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తు న్నారు. ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -