Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅసలు ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది

అసలు ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది

- Advertisement -

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శిం పబడుతోంది. ఈ సందర్భంగా గుంటూరులో విజయోత్సవ వేడుకను నిర్వహిం చారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌కి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ,’ నందు వల్లే ‘లెనిన్’ ఈ స్థాయికి వచ్చింది. రెండేళ్ల క్రితం నందు నాకు ఈ కథ చెప్పారు. ఆయన నన్ను నమ్మారు కాబట్టే ఈ చిత్రం వచ్చింది. ఒక్క ఫోన్ కాల్‌తోనే మా కోసం వచ్చి, వాయిస్ ఇచ్చిన తారక్ అన్నకి థాంక్స్. నాగవంశీతో ఈ నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆయనతో మున్ముందు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు చేయాలని కోరుకుంటు న్నాను. నా సతీమణి జైనబ్‌ని ఇంట్లో బంగారు తల్లి అని పిలుస్తాను. ఈ మూడేళ్లలో జైనబ్‌ నాకు కొండంత అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చారు.

మా నాన్న ఇచ్చిన హగ్‌లోనే ఈ పదేళ్ల శ్రమ, ప్రేమ కనిపిస్తుంది. నా సర్వస్వం అయిన నాన్నకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ‘లెనిన్’ను మా నాన్న తన భుజానికి ఎత్తుకుని రెండేళ్లు కష్టపడ్డారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుని ఉంటానో.. అందుకే అభిమానులు, ప్రేక్షక దేవుళ్లు ఇంత ప్రేమను చూపిస్తు న్నారు. ఇప్పుడు నేనేమీ కాలర్ ఎగరేయడం లేదు.. గంతులు వేయడం లేదు. ఇకపై నేను ప్రశాం తంగా ఉంటాను. సైలెంట్‌గా యుద్ధం చేస్తాను. ఇక్కడి నుంచి మన (అభిమానులు) ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇకపై నేను ప్రశాంతంగా మీ (అభిమానులు) కోసం యుద్ధం చేస్తాను’ అని అన్నారు.’ఒక సినిమా విజయం సాధిస్తే సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ , సినిమాటోగ్రపీ మినిస్టర్‌గా నేను సంతోషిస్తాం. ఇలా విజయాలు వస్తే ఇండస్ట్రీ మరింత ముందుకు వెళ్తుంది. అఖిల్ మొదటి నుంచీ కూడా ఎంతో కష్టపడుతూ ఉం టారు. అపజయాలకు బెదరకుండా నిర్విరామంగా చేసిన కృషికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు దక్కింది` అని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -