నవతెలంగాణ-కుభీర్
ఆయా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా చూడాలని పల్సి కంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దొంతుల సురేష్ అన్నారు. శుక్రవారం పార్డి (కే ) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలకు సంబదించిన విద్యార్థుల, ఉపాధ్యాయులు హాజరు పట్టికాలను పరిశీలించి మాట్లాడారు. ఆయా పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు సమయపాలన పాటించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించేలా చూడాలని తెలిపారు. అదే విదంగా ప్రయివేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యాబోధన అందుతుందని, దీనికి గ్రామమలో ఉన్న తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించేలా చూడాలన్నారు. ఆయన వెంట సిఆర్పీ గంగాధర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా చూడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



