Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఎల్ఓలకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కీలక సూచన

బీఎల్ఓలకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కీలక సూచన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం అత్యవసర కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ సర్వేలో SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా కొంతమంది ఓటర్ల పేర్లు మార్పుల (“Shifted” ) కేటగిరీలో నమోదు అయ్యి ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో సంబంధిత ఓటరు తన ఓటు యథావిధిగా కొనసాగించాలని కోరితే, వెంటనే వారి పూర్తి వివరాలను సేకరించి సంబంధిత బిఎల్ఓ (BLO) ద్వారా (ERO) దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పటికే  “Shifted” షిఫ్ట్ గా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులకు కూడా అవసరమైన పరిశీలన అనంతరం పుష్ బ్యాక్ (Push Back) చేసే అవకాశం ఎన్నికల అధికారులు కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలి.

అలాగే, తెలంగాణ రాష్ట్రంలో సర్ (SIR) కార్యక్రమం గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించిన నేపథ్యంలో , ఇంకా దరఖాస్తు సమర్పించని వారు లేదా తమ ఓటు వివరాలను ధృవీకరించని వారు వెంటనే పూర్తి చేసుకోవాలి అని అన్నారు. జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలకు విజ్ఞప్తి ఏమనగా  ప్రతి గ్రామం, ప్రతి బూత్ పరిధిలో ఈ సమాచారాన్ని విస్తృతంగా తెలియజేయండి  కార్యకర్తలకు ఆదేశించారు. షిప్ట్ (“Shifted” ) గా నమోదు అయిన ఓటర్లను గుర్తించి వారి వివరాలను వెంటనే సేకరించండి . సంబంధిత బిఎల్ఓ (BLO) ద్వారా ఈఆర్ఓ ( ERO) కు చేరేలా సమన్వయం చేయండి తెలిపారు.అర్హత ఉన్న ప్రతి ఓటరు, ఓటు హక్కు యథావిధిగా కొనసాగేందుకు కృషి చేయండి కోరారు. ప్రతి ఓటు విలువైనది  ప్రతి అర్హుడి ఓటు ఓటర్ల జాబితాలో ఉండేలా బిఆర్ఎస్ ( BRS) పార్టీ కుటుంబ సభ్యులు గా ఉండి మనందరం బాధ్యతగా పనిచేద్దాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లి గంగాధర్, మాజీ అధ్యక్షుడు వాస్రే రమేష్ , మాజీ జెడ్పిటిసి పండరి, మాజీ ఎంపీపీ షేట్కార్  బసవంతరావు పటేల్, మద్నూర్ మండల అధ్యక్షుడు వంశీ పటేల్, బిచ్కుంద మండలం మిషన్ కల్లాలి మాజీ సర్పంచ్ సంజీవ్ పటేల్, చిన్న ఏడ్గి మాజీ సర్పంచ్ భర్త శివాజీ పటేల్ , మాజీ ఎంపీటీసీ వజ్రఖండి రాందాస్ పటేల్, బిచ్కుంద ఆర్ఎంపీ డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -