నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శుక్రవారం కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ లుక్క గంగాధర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు లుక్క గంగాధర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ అసోసియేషన్ తరపున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు వృక్షాలుగా మారి ప్రాణవాయువును అందించేందుకు తోడ్పడతాయన్నారు. మొక్కలు నాటడం ద్వారా వర్షాలతో పాటు వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భోగ శ్యామ్, కార్యదర్శి చిలువేరి పవన్ కుమార్, సలహాదారుడు పెంట కిషన్, చింత ప్రదీప్, ఉద్యోగ గంగాధర్, చంద్రశేఖర్, చింత తిరుపతి, శ్రీపాద రాహుల్, చింత నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



