Saturday, July 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్న్‌హామ్

బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్న్‌హామ్

- Advertisement -


లేబర్‌ ‌పార్టీ నేతగా ఎన్నిక
లండన్‌ :
బ్రిటన్ అధికార లేబర్ పార్టీ కొత్త నేతగా ఆండీ బర్న్‌ హామ్ శుక్రవారం ఖరారయ్యారు. లండన్‌లో జరిగిన ప్రత్యేక పార్టీ సదస్సులో లేబర్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్‌ఈసీ) చైర్‌పర్సన్ షబానా మహమూద్ ఈ ప్రకటన చేశారు. వచ్చే వారం బర్న్‌ ‌హామ్‌ ‌ప్రధానిగా భాద్యతలు చేపట్టనున్నారు. గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయరైన బర్న్‌ హామ్‌కు హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 403 మంది లేబర్ చట్టసభ్యుల్లో 379 మంది మద్దతు లభించడంతో ఆయన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. దీంతో మాజీ ప్రధాని కియర్ స్టార్మర్‌ స్థానంలో బర్న్‌హామ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కింగ్ చార్లెస్- III బర్న్‌హామ్‌ను ఆహ్వానించనున్నారు. లేబర్‌ ‌పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం బర్న్ హామ్‌ ‌మాట్లాడుతూ ప్రజల ఆశలను మళ్లీ పునరుద్దరిస్తానన్నారు. రాజకీయ అస్తిరతను, ఆర్థిక నమూనాను మారుస్తానన్నారు. అలాగే, వెనకబడిన ప్రాంతాల ప్రజల అసంతృప్తిని తగ్గించేందకు కృషి చేస్తానని తెలిపారు. అంతేకాకుండా అధికార వికేంద్రీకరణ ద్వారా అసమానతలు తొలగిస్తానంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -