Saturday, July 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద షక్కర్గాలో నాలుగు రకాల చెత్త సేకరణ కార్యక్రమం

పెద్ద షక్కర్గాలో నాలుగు రకాల చెత్త సేకరణ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా గ్రామపంచాయతీ పరిధిలో నాలుగు రకాల చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే గ్రామ ప్రజలు చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయొద్దన్నారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం నాలుగు రకాల డబ్బాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్త చెత్త, ఈ విధంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు చెత్త సేకరణ కార్యక్రమం చేపడతారని చెప్పారు. గ్రామస్తులు చెత్తను డబ్బాలలో మాత్రమే వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు సర్పంచ్ కుటుంబీకులు, సలాబత్పూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ రామ్ పటేల్, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గం, సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -