Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు: సీఐ రాజేష్

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు: సీఐ రాజేష్

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక
నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టెందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతయని దుబ్బాక సీఐ రాజేష్ అన్నారు. శనివారం మండలంలోని, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో సర్పంచ్ ఎన్. సమీరా పరమేశ్వర్ రెడ్డి అధ్వర్యంలో 10 సీసీ కెమెరాలు దుబ్బాక సీఐ టీ. రాజేష్ ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాల్లో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసు కోవాలని, పోలీసులకు సర్పంచులు సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా సురక్ష నేత్రలో ఉండాలని ఆకాంక్షించారు. గోవర్ధనగిరిలో 10సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ సమీరా పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అభినందించారు. కార్యక్రమంలో మిరుదొడ్డి ఎస్ఐ సతీష్, సర్పంచ్ సమీరా పరమేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ తోయేటి శ్రీనివాస్, పంచాయితీ కార్యదర్శి సునీత, పోలీస్ సిబ్బంది, వార్డు సభ్యులు తోయేటి రేణుక, మండల లింగం, గడ్డం యాదగిరి, నంట స్వప్న, ఉప్పరి పద్మ, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -