- Advertisement -
నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంలోని సెంట్ మేరీ హైస్కూల్ విద్యార్థులు వినాయకుని నిమజ్జనం సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. 8, 9, పదవ తరగతి విద్యార్థులు పోటీపడి ఉట్టిని కొట్టారు. గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం నగదు బహుమతులను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డైసన్, లింగం, రవికుమార్, సీన జోసెఫ్, సినీస్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



