నవతెలంగాణ-దామరగిద్ద
మండల పరిధిలోని లోకుర్తి గామంలో సర్వే నంబర్ 2లో ఉన్న భూములను అప్పటి భూస్వామి రామిరెడ్డి దళితుల పేర ప్లాట్లు చేయించారని ఎమ్మార్పీఎస్ మాజీ మండలాధ్యక్షులు బొంబాయి రాములు అన్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన రామిరెడ్డి అవి మా భూములంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వామి రామిరెడ్డి దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనీ, భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించే పనిలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులకు సంబంధించిన భూములు దళితులకే చెందాలని స్పష్టం చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున దళితుల పక్షాన ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచ్ రాజు మాట్లాడుతూ.. ఇరువురి సమక్షంలో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెంకట రాములు, జేవి రావు, నర్సాపూర్ లాలప్ప, నరసింహులు, మొగులప్ప, సంజీవు, పెంటప్ప, తదితరులు పాల్గొన్నారు.
దళితుల భూములు దళితులకే చెందాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



